UPDATED 9th FEBRUARY 2018 FRIDAY 9:00 PM
రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని కెఎల్ఆర్ లెనోరా దంత వైద్య కళాశాలలో ఈ-లైబ్రరీపై అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాజ్ మహాపాత్ర హాజరై మాట్లాడారు. పిపిటి ద్వారా పిజి విద్యార్థులు, సిబ్బంది ఆధునిక వసతులను, జర్నల్స్, సమయం ఆదా,ఈ జర్నల్స్ ఏ విధంగా ఉపయోగించుకోవాలి, శోధించాలో తెలియచేశారు. విద్యార్థులు రీసెర్చ్ కు అనుగుణంగా మనం వెతికే అంశం భద్రపరుచుకోవడం, ఈ మెయిల్ ఎలర్ట్ ద్వారా శోధన మొదలైన అంశాలు వచ్చే విధంగా మెళకువలు నేర్పించారు. అలాగే పలు విషయాలపై అవగాహన కల్పించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విశ్వప్రకాష్ శెట్టి మాట్లాడుతూ విద్యకు సంబంధించిన అంశాలు, చర్చా గోష్ఠులు చాల సంతృప్తికరమని, ఇటువంటి కార్యక్రమాలకు తమ కళాశాల ఎప్పుడూ ముందు ఉంటుందన్నారు. పిజి డైరెక్టర్ డాక్టర్ బి. లక్ష్మణరావు మాట్లాడుతూ పిజి విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, విద్యార్థులకు చాల ఉపయోగకరమన్నారు. ఈ కార్యక్రమంలో లెనోరా డైరెక్టర్లు జి. నాగార్జునరెడ్డి, ఎ. ప్రసాద్ చౌదరి, లైబ్రరీ విభాగం సిబ్బంది ఎస్. రాంబాబు, జి. రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.







