ప్రజా సంక్షేమ పాలనే కాంగ్రెస్ లక్ష్యం

UPDATED 21st AUGUST 2017 MONDAY 6:00 PM

నంద్యాల: ప్రజా సంక్షేమ పాలనే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పెదిరెడ్డి ప్రదీప్ అన్నారు. ఉప ఎన్నికల నేపధ్యంలో సోమవారం నంద్యాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అబ్దుల్ ఖాదర్ తరపున ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అలాగే పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సంధర్భంగా ప్రదీప్ మాట్లాడుతూ అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని కోరారు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని గుర్తు చేశారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీనే నమ్ముతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ అభ్యర్ధిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అబ్రహం రాయ్ మణీజీ, ఊట్ల వరప్రసాద్, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us