గైట్ లో ఎంబిఎ విద్యార్థుల భవిష్య అవకాశాలపై వర్క్ షాప్

UPDATED 11th APRIL 2018 WEDNESDAY 9:00 PM

రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గోదావరి ఇనిస్టిట్యూట్ అఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ(గైట్) కళాశాలలో ఎంబిఎ విద్యార్థుల భవిష్య అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక విభాగాలు ఎంపిక చేసుకునే విషయంపై ఒకరోజు జాతీయస్థాయి వర్క్ షాప్ నిర్వహించారు. కళాశాల మేనేజ్ మెంట్ డైరెక్టర్ డాక్టర్ పి.ఆర్.కె. రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కోకాకోలా కంపెనీ ట్రైనింగ్ మేనేజర్ శ్రీనివాస్, మైండ్ ట్రీట్ సిఇవో డాక్టర్ నాగేంద్రకుమార్, నన్నయ యూనివర్సిటీ ఎంబిఎ విభాగాధిపతి డాక్టర్ ఉదయ్ భాస్కర్, ముఖ్య అతిథులుగా  హాజరైనారు. ఈ సదస్సులో ఫైనాన్స్, మార్కెటింగ్, హెచ్.ఆర్ విభాగాలలో నేర్చుకోవలసిన విషయాలు, తద్వారా బహుళజాతి కంపెనీలతో పాటు విదేశీ అవకాశాలు, స్పెషలిజషన్ ఎంపికలో తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి వివరించారు. అనంతరం పారిశ్రామిక ప్రాజెక్ట్ మెథడాలజీ, అవుట్ కం బేస్డ్ వర్క్స్ పై విశ్లేషణ జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సూర్యనారాయణ రాజు మాట్లాడుతూ విద్యార్థులు ప్రపంచీకరణ దృష్ట్యా కేవలం కొన్ని అంశాలకే కాకుండా అల్ రౌండ్ ప్రతిభ సాధించడం ద్వారా అవకాశాలు మెరుగుపరుచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రుద్ర, ప్రొఫెసర్ సత్యనారాయణ, ప్రొఫెసర్ నాగేశ్వరి, సుమారు 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ విద్యార్థులుగా ఎంపికైన శ్రీనివాస్, శ్రావణిలను ప్రత్యేకంగా సత్కరించారు.       

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us