జగ్గంపేట ఎస్ఐపై వేటు...

UPDATED 27th JANUARY 2022 THURSDAY 10:00 PM

కాకినాడ (రెడ్ బీ న్యూస్): తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట ఎస్ఐ సీరా లక్ష్మీకాంతంపై వేటు పడింది. జగ్గంపేట పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న ఆమెను శాఖాపరమైన చర్యల్లో భాగంగా విధుల నుంచి తప్పించి కాకినాడ డిఎస్.బికి అటాచ్ చేస్తూ జిల్లా ఎస్పీ ఎం. రవీంద్రనాధ్ బాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె వ్యవహార శైలిపై పలు ఫిర్యాదులు అందడంతో పాటు ఈనెల 25వ తేదీన గ్రావెల్ అక్రమ తరలింపు వ్యవహారంలో పెద్దాపురం పోలీసులకు పట్టుబడిన ఎనిమిది లారీలు విషయం వివాదాస్పదం కావడంతో పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us