UPDATED 3rd DECEMBER 2018 MONDAY 6:00 PM
పెద్దాపురం: కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక పాతబస్టాండ్ వద్ద నూతనంగా నిర్మించిన ఏఐటీయూసీ అనుబంధ పెద్దాపురం జట్లు వర్కర్స్ యూనియన్ భవనాన్ని సోమవారం మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని, వారి సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. చంద్రన్నభీమా పథకం ద్వారా కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించిందన్నారు. ఈ సందర్భంగా సీనియర్ కార్మికులు గనిశెట్టి శ్రీను, మజ్జి సత్యనారాయణలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, ఆత్మ చైర్మన్ కలకపల్లి రాంబాబు(రాము), ఏఐటీయూసీ నాయకులు పి.ఎస్. నారాయణ, పెదిరెడ్ల సత్యనారాయణ, మహారాణి సత్రం మాజీ చైర్మన్లు కనకాల సుబ్రహ్మణ్యేశ్వరరావు, కొత్త వీరన్న, జట్లు వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు యాకా రామకృష్ణ, పోలపర్తి తాతారావు, ముమ్మన సత్యనారాయణ, వెలివెల చిన్నరత్తయ్య, తాళ్లూరి గొల్లబ్బాయి, బొట్ట త్రిమూర్తులు, తదితరులు పాల్గొన్నారు.







