UPDATED 27th MAY 2018 SUINDAY 9:00 PM
ఏలూరు: హేలాపురి డైమండ్స్ లైన్స్ క్లబ్, శ్రీ లక్ష్మీ నరసింహ కనస్ట్రక్షన్స్ అధినేత గుమ్మడి చైతన్య కృష్ణ ఆధ్వర్యంలో స్థానిక సత్రంపాడులోని ఆనంద్ హెూమ్స్ అపార్టుమెంటులో వారి కుమారుడు వైభవ్ జన్మదినోత్సవం సందర్భంగా ఉచిత నేత్ర వైద్య శిబిరం ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని హేలాపురి డైమండ్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పెద్దిరెడ్డి ప్రదీప్, కొమ్మన మోహన్, ఎవిఎం రావులు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ కనస్ట్రక్షన్స్ అధినేత చైతన్య కృష్ణ మాట్లాడుతూ వైభవ్ జన్మదినోత్సవ వేడుకలను హెూటల్స్ లో విలాసవంతంగా జరుపుకోవడం కన్నా అవసరమైన వారికి ఆపన్న హస్తం అందించడం ద్వారా చిన్న వయస్సులో ఉన్న పిల్లలకు కూడా సేవా భావాన్ని పెంపొందించవచ్చని అన్నారు. హేలాపురి డైమండ్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ప్రదీప్ మాట్లాడుతూ నిడదవోలు రాజేశ్వరి రామకృష్ణన్ నేత్ర వైద్యశాల సౌజన్యముతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్లజోళ్లు పంపిణీ చేయడం జరిగిందని, కంటి వ్యాధులు ఉన్న వారిని నిడదవోలు లైన్స్ క్లబ్ వారు ఉచిత కంటి ఆపరేషన్లు చేయడం జరుగుతుందన్నారు. ప్రతీ ఒక్కరూ నేత్ర పరిరక్షణపై అవగాహన పెంపొందించుకోవాలని, లయన్స్ క్లబ్ ద్వారా ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. ఈ శిబిరంలో 150 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, 40 మందికి కళ్లజోళ్లను పంపిణీ చేశారు. 9 మందికి కంటి ఆపరేషన్లు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఎంవిఆర్, సురేష్, సెక్రటరీ విజయలక్ష్మి, డి. సత్యనారాయణ, చిట్టూరి శ్రీనివాసరావు, సి.హెచ్. శ్రీనివాస్, కృష్ణ మోహన్, శివనాగ పోతురాజు, చింతయ్య , లయన్స్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.







