UPDATED 2nd JANUARY 2020 THURSDAY 6:00 PM
గండేపల్లి(రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల, ఆదిత్య టెక్నికల్ హబ్ సంయుక్త ఆధ్వర్యంలో వైఫై అను పేరుతో ఒక ఈవెంట్ ను నిర్వహించినట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. విద్యార్థులకు ఆధునిక ప్రోగ్రామింగ్, లాంగ్వేజెస్ లో ప్రథమ స్థానంలో ఉన్న ఫైథాన్ ను వివిధ రంగాలైన ఐఓటి, నెట్ వర్కింగ్, ఇమేజ్ ప్రాసెసింగ్, ఇంటెలిజెన్స్ లలో ఏవిధంగా ఉపయోగించాలో శిక్షణ ఇచ్చేందుకు ఆదిత్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ ను గత నెల 23 నుంచి వారం రోజుల పాటు నిర్వహించామని ఆదిత్య టెక్నికల్ హబ్ సిఈఓ బాబ్జి నీలం తెలిపారు. ఈ ఈవెంట్ లో 250 మందికి పైగా విద్యారులు పాల్గొని శిక్షణ పొందారని, చివరి రోజున విద్యార్థులకు నిర్వహించిన కోడింగ్ పరీక్షల్లో మొదటి మూడు స్థానాలు పొందిన డి. సత్యకృష్ణ, డి.నరేంద్రబాబు, కె. చక్రధర్ లకు బహుమతులు అందచేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఫైథాన్ మీద పనిచేసిన ఇండస్ట్రీ నిపుణులు కె. రాజీవ్ విద్యార్థులకు తగు సూచనలు, సలహాలను అందించారని, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులలో నైపుణ్యాభివృద్ధి పెంపొందించడానికి ఎంతో దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా, విజ్ఞానదాయకంగా నిర్వహించిన టెక్నికల్ హబ్ టీం ఆర్. సుధీర్, బి. రాజేష్, ఎం. అశోక్, ఎన్. ప్రసాద్, బి. శివ సందీప్, కె. నరసింహ, బి. వీరబాబు, తదితర సభ్యులను వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి, టెక్నికల్ హబ్ సిఈఓ బాబ్జి నీలం అభినందించారు.







