Rs 2000 denomination: రూ.2 వేల నోట్లను చలామణీ నుంచి ఉపసంహరిస్తున్నాం: ఆర్బీఐ సంచలన ప్రకటన

Updated 19th May 2023 Friday 7:15 pm

RBI: భారతీయ రిజర్వు బ్యాంకు సంచలన ప్రకటన చేసింది. రూ.2 వేల నోట్లను చలామణీ నుంచి ఉపసంహరిస్తున్నామని చెప్పింది. వినియోగదారులకు రూ.2 వేల నోట్ల ఇవ్వకూడదని బ్యాంకులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఆర్బీఐ ఆదేశాలు తక్షణమే అమల్లోకి రానున్నాయి.

అలాగే, సెప్టెంబరు 30 వరకు మాత్రమే రూ.2 వేల నోటు చెల్లుబాటు అవుతుందని ఆర్బీఐ (Reserve Bank of India) పేర్కొంది. అంటే రూ.2 వేల నోట్లు ఉన్నవారు బ్యాంకుల్లో ఆ తేదీలోపు మార్చుకోవచ్చు. ఈ నెల 23 నుంచి బ్యాంకుల్లో వినియోగదారులు రూ.2 వేల నోట్లను మార్చుకోవచ్చు. 2018-2019 ఆర్థిక ఏడాదిలోనే ఆర్బీఐ రూ.2 వేల నోట్ల ముద్రణను ఆపేసింది.

ఒక విడతలో రూ.20,000 నోట్లను మార్చుకునే అవకాశం మాత్రమే ఆర్బీఐ కల్పించింది. రూ.2 వేల నోట్లను రద్దు చేస్తారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ నోట్లు చలామణీలో చాలా వరకు తగ్గాయి.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us