ఆరవరోజు ఎన్ఎస్ఎస్ ఆయుష్కం ప్రత్యేక శిబిరం

UPDATED 11th JANUARY 2019 FRIDAY 6:30 PM

గండేపల్లి: ఆదిత్య డిగ్రీ కళాశాల, ఫోరెన్సిక్ సైన్స్ ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో పెద్దాపురం మండలం ఆనూరు గ్రామంలో జరుగుతున్న ఆయుష్కం ప్రత్యేక శిబిరం ఆరవరోజుకు చేరుకుంది. ఈ సందర్బంగా ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యమంటే సరైన వైద్యం మాత్రమే కాదని, ఆరోగ్యానికి శరీర వ్యాయామం కూడా ఎంతో ముఖ్యమని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా చురుకుగా పాల్గొనాలని అన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమిక
పాఠశాల విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించి గెలుపొందిన విజేతలకు బహుమతులు అందచేశారు.  అనంతరం ఎన్ఎస్ఎస్ విద్యార్థినులు సంక్రాతి సంబరాల్లో భాగంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో ముగ్గుల పోటీలలో పాల్గొని తమ కళాత్మక ప్రతిభను కనబర్చారు. పండుగ వాతావరణాన్ని సృష్టించిన ఎన్ఎస్ఎస్ బృందానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగభూషణం అభినందించారు. ముగ్గులు వేసే కళ రాను రాను అంతరించి పోతుందని, ఇటువంటి కార్యక్రమాల్లో విద్యార్థినులు పాల్గొని మన కళ, సంస్కృతిని కాపాడాలని కళాశాల ప్రిన్సిపాల్ ఇ. మోహన్  విద్యార్థులను ప్రోత్సహించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us