UPDATED 4th JANUARY 2019 FRIDAY 9:00 PM
సామర్లకోట: స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాల సైన్స్ ఉపాధ్యాయురాలు ఏ.ఎల్.వి. కుమారి సావిత్రీభాయిపూలే నేషనల్ ఫెలోషిప్ అవార్డును రాజమహేంద్రవరంలో సినీనటి రమ్యశ్రీ, సింగర్ బేబీ, ప్రముఖ రోటరియన్ పట్టపగలు వెంకట్రావుల చేతుల మీదుగా గురువారం అందుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం తోటకూర సాయిరామకృష్ణ ఆధ్వర్యంలో అవార్డు గ్రహీతను శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మున్సిపల్ చైర్ పర్సన్ మన్యం పద్మావతి, సీనియర్ కౌన్సిలర్ మన్యం చందర్రావు, మున్సిపల్ కమీషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధిస్తున్నారని, తొలితరం మహిళా ఉపాధ్యాయురాలైన సావిత్రీభాయిపూలే జయంతి వేడుకల్లో ఈ పురస్కారం అందుకోవడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా ఆమెను దుశ్శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ అచ్యుతరాజు, జిల్లా మానవహక్కుల పరిరక్షణా సంఘం అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ, పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ తాళ్లూరి వైకుంఠం, ఉపాధ్యాయులు జి. గోవిందు, కె. అరుణ, కెవివి.సత్యనారాయణ, శ్రీ లక్ష్మీవల్లి, ఏపీ రాజేంద్రకుమార్, తదితరులు పాల్గొన్నారు.







