ఫైర్ వర్క్స్ గొడౌన్ లో అగ్నిప్రమాదం

పెద్దాపురం: 5 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్): మండలంలోని జి.రాగంపేట గ్రామంలో ఫైర్ వర్క్స్ గోడౌన్ లో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపకాధికారి బంగారపు ఏసుబాబు తెలిపిన వివరాల ప్రకారం వినాయక ఫైర్ వర్క్స్ గొడౌన్లో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో గొడౌన్లో ఉన్న క్రాకర్స్, జువ్వలు,టపాకాయలు మొదలయినవి పెద్ద పెద్ద శబ్దాలతో పేలిపోయాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఇదిలా ఉండగా ఈ గొడౌన్ ను ఆరునెలల క్రితం అధికారులు సీజ్ చేశారు. ఫైర్ కావడానికి కారణాలు తెలియరాలేదని ఫైర్ ఆఫీసర్ తెలిపారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us