UPDATED 13th AUGUST 2020 THURSDAY 9:00 PM
రాజానగరం(రెడ్ బీ న్యూస్): ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ (ఐఆర్‌సిఎస్) రాష్ట్ర కోశాధికారి, విద్యావేత్త జి.వై.ఎన్. బాబు అకాలమృతి పట్ల రెడ్‌క్రాస్ స్టేట్ మేనేజ్ మెంట్ కమిటీ మెంబెర్ వై. మధుసూదన్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కోశాధికారితో సహా వివిధ సంస్థలలో బాబు అనేక ప్రతిష్టాత్మక పదవులను నిర్వహించి అమూల్యమైన సేవలను అందించారని అన్నారు. వ్యక్తిగతంగా నాకు ఎంతో ప్రేరణగా నిలిచిన నిబద్ధత గల వ్యక్తిని కోల్పోవడం ఎంతో బాధాకరమని ఆయన సంతాపం వ్యక్తం చేశారు.







