వెయిట్ లిఫ్టింగ్ లో సురేష్ రాజుకు సిల్వర్ మెడల్

UPDATED 22nd OCTOBER 2018 MONDAY 5:30 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్లో ద్వితీయ సంవత్సరం  ఎంబిఎ విద్యార్థి ఎల్.ఎస్.ఆర్.ఎస్. సురేష్ రాజు వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ద్వితీయస్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నట్లు కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సుగుణారెడ్డి మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా రాజాంలో గల జిఎంఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో నిర్వహించిన ఈ పోటీల్లో తమ కళాశాల విద్యార్థి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి సిల్వర్ మెడల్ సాధించినట్లు ఆమె తెలిపారు. విద్యార్థులు కేవలం పుస్తక పరిజ్ఞానానికే పరిమితం కాకుండా క్రీడల్లో రాణించినపుడే మానసిక ఉల్లాసంతో విజేతలుగా నిలుస్తారని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ డి. ఆస్థాశర్మ, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, తదితరులు అభినందించారు.             

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us