ఆదిత్య ప్రొఫెసర్ కు డాక్టరేట్

UPDATED 7th JULY 2017 THURSDAY 3:00 PM

గండేపల్లి : తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో హెచ్ అండ్ బీఎస్ డిపార్టుమెంటుకు చెందిన సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్. అరుణకుమారి కి ఆంధ్రాయూనివర్సిటీ  డాక్టరేట్  అందించింది. నొవల్ మెటల్ ఆర్గానిక్ కంప్లెక్సీస్; సింథసిస్, క్యారెక్టరైజేషన్ అండ్ ఫార్మాకాలజికల్ స్టడీస్ అనే అంశంపై చేసిన పరిశోధనకు ఈ డాక్టరేట్ లభించింది. తన పరిశోధనకు గైడ్ గా ఆర్.మురళీకృష్ణ, కో-గైడ్ గా తమ సహాయ సహకారాలు అందించారన్నారు. డాక్టరేట్ పొందిన అరుణకుమారిని కళాశాల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి అభినందించారు. తమ కళాశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగికి డాక్టరేట్ లభించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత డిగ్రీలు పొందాలని ఆకాక్షించారు. అలాగే కళాశాల ప్రిన్సిపాల్. ప్రొఫెసర్ మేడపాటి శ్రీనివాస రెడ్డి, వైస్ ప్రిన్సిపల్స్ ప్రొఫెసర్ వల్లెం శ్రీనివాసరావు, డాక్టర్ రమాశ్రీ, హెచ్ వోడీ లు, అధ్యాపకులు అభినందనలు తెలియచేశారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us