UPDATED 19th JULY 2019 FRIDAY 9:00 PM
సామర్లకోట: సామర్లకోట పట్టణ పరిధిలోని స్థానిక స్టేషన్ సెంటర్లో గల ప్లాస్టిక్ కవర్ల విక్రయ దుకాణాలపై శుక్రవారం మున్సిపల్ కమీషనర్ ఎం. ఏసుబాబు ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు దుకాణాలలో తనిఖీలు నిర్వహించి ప్లాస్టిక్ కవర్లను సీజ్ చేశారు. అనంతరం కమీషనర్ ఏసుబాబు మాట్లాడుతూ పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చి కాలుష్య భూతాన్ని తరమికొట్టాలని సంకల్పించామని, ఇందులో భాగంగా కాలుష్యానికి కారణమవుతోన్న ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని సంపూర్ణంగా నిషేధించామని అన్నారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే విధంగా ఎలాంటి విక్రయాలు చేపట్టినా సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ శానిటరీ ఇనస్పెక్టర్ రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.







