UPDATED 14th DECEMBER 2018 FRIDAY 9:00 PM
సామర్లకోట: పాడి పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రైతు సంఘం అధ్యక్షులు కంటే జగదీష్ మోహన్ అన్నారు. స్థానిక పశువైద్య కేంద్రం ఆవరణలో ఆత్మ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన పశువైద్య శిబిరంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ఆపరేషన్ థియేటరును ప్రారంభించారు. ఈ సందర్భంగా విబిఆర్ఐ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ అనురాధ మాట్లాడుతూ వాతావరణంలో వచ్చే మార్పులు వల్ల పశువుల్లో అనేక రకాల వ్యాధులు సంక్రమిస్తాయని, ఆయా వ్యాధుల నివారణకు పశువైద్య కేంద్రాల్లో ముందస్తుగా వాక్సిన్లు వేయించాలని అన్నారు. అనంతరం నట్టల నివారణ మందులు, పశువుల దాణాను రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మీనారాయణ, ఏడిలు రాంప్రసాద్, సూర్యకుమారి, ఎర్రం శ్రీనివాస్, వరప్రసాద్, అంబేద్కర్, డాక్టర్ మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.







