పేదరికం లేని సమాజ నిర్మాణమే టిడిపి ధ్యేయం

UPDATED 29th MARCH 2019 FRIDAY 9:00 PM

సామర్లకోట: పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు చల్లా బుజ్జి అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సామర్లకోట మండలం హుస్సేన్ పురం గ్రామంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చల్లా బుజ్జి మాట్లాడుతూ పేదవాడికి పట్టెడన్నం పెట్టడం తెలుగుదేశం పార్టీ అసలు లక్ష్యమని, ఈ ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ ఏర్పడి నిరుపేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిందని అన్నారు. మన రాష్ట్రం అభివృద్ధి బాటలో కొనసాగాలన్నా, భావితరాల వారికి మంచి భవిష్యత్తు రావాలన్నా అది కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్ధించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.     

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us