సమరయోధుల త్యాగాల వల్లే స్వేచ్ఛాజీవనం

UPDATED 15th AUGUST 2019 THURSDAY 8:00 PM

గండేపల్లి: ఎందరో స్వాతంత్య్ర సమర యోధుల త్యాగఫలాలే నేటి స్వేచ్ఛాయుత జీవితానికి కారణమని ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు అన్నారు. గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. దేశం కోసం తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టి పోరాడిన మహానుభావులను యువత ఆదర్శంగా తీసుకోవాలని, ఆ మహనీయుల త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్య్రం సిద్ధించిందని అన్నారు. అనంతరం ఈ విద్యా సంవత్సరంలో అత్యధిక ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినీ, విద్యార్థులకు ఆయన బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూ ప్రసాద్, డైరెక్టర్ మేనేజ్ మెంట్ ఎంవి హరనాధ్ బాబు, డైరెక్టర్ డాక్టర్ జి. రఘురాం, వైస్ ప్రెసిడెంట్ ఎం. సతీష్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సత్యనారాయణ, డీన్ అడ్మిన్ డాక్టర్ జి. నరేష్, డీన్ ఆర్&డి డాక్టర్ పివిఎస్ మాచిరాజు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.        

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us