గంగవరం (రెడ్ బీ న్యూస్) 30 డిసెంబర్ 2021: పాఠశాలల్లో విద్యార్థుల హాజరు నూరు శాతం ఉండేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని మండల విద్యాశాఖాధికారి వై. మల్లేశ్వరరావు ఆదేశించారు. గురువారం మండలంలోని కొత్తాడలో కస్తూరిబా విద్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలో పలు రికార్డులను తనిఖీ చేసి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. అలాగే విద్యాలయం నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ ప్రీ పబ్లిక్ పరీక్షల నిర్వహణ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సబ్జెక్టులో వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. ఆయన వెంట విద్యాలయం ప్రత్యేక అధికారిణి పద్మావతి, సి.ఆర్.పి ప్రసాద్ తదితరులు ఉన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







