UPDATED 10th MAY 2018 THURSDAY 9:00 PM
సామర్లకోట: మండల పరిషత్ అభివృద్ధి అధికారిణిగా కె. స్వప్న గురువారం భాద్యతలు స్వీకరించారు. గత నెలలో పదవీ విరమణ చేసిన ఎంపిడివో బి. నాగేశ్వరరావు స్థానంలో ఆమె నియమితులయ్యారు. ఇంతవరకు ఇంఛార్జ్ ఎంపిడివోగా ఈవోపీఆర్డీ సి.హెచ్. జగ్గారావు వ్యవహరించారు. ఎ.పి.పి.ఎస్.సి ద్వారా నియామకం పొందిన స్వప్నను జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఎంపిడివోగా నియమిస్తూ ఉత్తరువులు జారీచేయడంతో ఆమె భాద్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా భాద్యతలు స్వీకరించిన స్వప్నకు ఎంపిపి ఆకునూరి సత్తిబాబు, కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛము అందించి శుభాకాంక్షలు తెలియచేశారు.







