UPDATED 18th AUGUST 2018 SATURDAY 9:00 PM
సామర్లకోట: జీసస్ మినిస్ట్రీస్ స్వచ్ఛంద సంస్థ స్థానిక బ్రౌన్ పేట మానవ హక్కుల పరిరక్షణా సంఘం ఆవరణలో వృద్దులు, దివ్యాంగులకు సంస్థ వ్యవస్థాపకులు పిట్టా అప్పారావు చేతుల మీదుగా శనివారం రూ. మూడు వందలు వంతున పింఛన్లు అందచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మానవ హక్కుల పరిరక్షణా సంఘం అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ, ప్రధాన కార్యదర్శి అళక్కి శ్రీనివాసరావు, కార్యదర్శి కుంచే నానిబాబు, మెంబర్ ఎస్. రెహమాన్, మినిస్ట్రీస్ ఆర్గనైజర్ లింగం గంగాధర్, మినిస్ట్రీస్ మేనేజర్ ద్వారపూడి శ్రీనివాస్, గ్రూపు సభ్యులు మేడపాటి సుగుణకుమారి, తదితరులు పాల్గొన్నారు.







