UPDATED 7th DECEMBER 2018 FRIDAY 9:00 PM
సామర్లకోట: వచ్చే సంవత్సరం మార్చి నెల 18వ తేదీ నుంచి జరగనున్న పదవతరగతి పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణతతో పాటు అత్యధిక సంఖ్యలో 10 జీపీఏ పాయింట్లు సాధించడానికి మున్సిపల్ విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు స్టేట్ కోఆర్డినేటర్ ఎం. బాబురావు పేర్కొన్నారు. మున్సిపల్ కమీషనర్ సిహెచ్ వెంకటేశ్వరావు అధ్యక్షతన స్థానిక మున్సిపల్ కమీషనర్ కార్యాలయంలో మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులతో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ ప్రతీ సెలవుదినాల్లో స్పెషల్ తరగతులు నిర్వహించి 10 జీపీఏ సాధించేందుకు కృషి చేయాలని, సిలబస్ ను నాలుగు భాగాలుగా విభజించి రాష్ట్రవ్యాప్తంగా ఒకే ప్రశ్నపత్రాలను రూపొందించి విద్యార్థుల సామర్థ్యాన్ని మదింపు చేస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ కమీషనర్ వెంకటేశ్వరావు మాట్లాడుతూ ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమన్వయంతో కృషిచేసి మంచి ఫలితాలు సాధించేందుకు ప్రయత్నించాలని అన్నారు. ఇటీవల బదిలీ అయిన ఉపాధ్యాయుల స్థానంలో డిఎంఏ ఆదేశాల మేరకు పార్ట్ టైం ఉపాధ్యాయులను నియమిస్తామని, విద్యార్థుల అభ్యున్నతికి అనేక సదుపాయాలను కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో
హెచ్ఎంలు తోటకూర సాయిరామకృష్ణ, యు. సత్యనారాయణ, ఆర్. శ్రీనివాసరాజు, టి. శ్యాంసుందర్,
యు.ఎల్.బి కోఆర్డినేటర్ కెఎస్ఎస్ శేఖరం, విద్యాశాఖ సీనియర్ అసిస్టెంట్ సుజాత, తదితరులు పాల్గొన్నారు.







