UPDATED 5th OCTOBER 2018 FRIDAY 7:30 PM
రాజానగరం: గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్ కళాశాలలో యునిటీ త్రీ డి, గేమింగ్ హాక్ థాన్ పై అవగాహనా సదస్సు శుక్రవారం ప్రారంభించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.వి. ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు గేమింగ్ లో వారి నైపుణ్యాలను మరింత మెరుగుపరిచేందుకు ఈ శిక్షణ ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఈ వర్క్ షాపును భావి భారత ఇంజినీర్లు సద్వినియోగం చేసుకుని ప్రయోజనం పొందాలని పేర్కొన్నారు. గైట్ టిపివో కె. వల్లీమాధవి మాట్లాడుతూ ఏపిఐటిఏ, యూనిటీ త్రీ డి, ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో గైట్ నిర్వహణలో ఈ వర్క్ షాప్ జరుగుతోందని, ఇందులో 47 మంది విద్యార్థులు పాల్గొంటున్నారని అన్నారు. ఫోటో సింథసిస్, గేమింగ్ డిజైన్ లపై ముంబైలోని యూనిటీ త్రీ డి ఫీల్డ్ ఇంజనీర్ మాధుర్ గుప్తా, మేనేజర్ ఆర్.పి. తేజ విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గైట్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. సూర్యనారాయణ రాజు, జనరల్ మేనేజర్ డాక్టర్ పి. సుబ్బరాజు, తదితరులు పాల్గొన్నారు.







