జాతీయ ఎయిర్ రైఫిల్ క్రీడాకారిణికి జర్మనీ రైఫిల్ బహూకరణ

UPDATED 4th MAY 2019 SATURDAY 6:00 PM

రాజానగరం: జాతీయ ఎయిర్ రైఫిల్ క్రీడాకారిణి దెందుకూరి మహితకు జర్మనీలో తయారైన ఎల్.జి.400 వాల్టర్ ఆటోమేటిక్ రైఫిల్ ను చైతన్య విద్యా సంస్థల చైర్మన్ కెవివి సత్యనారాయణరాజు (చైతన్య రాజు)  అందచేశారు. గైట్ కళాశాలలో శనివారం జరిగిన కార్యక్రమంలో చైర్మన్ చైతన్యరాజు మాట్లాడుతూ ఢిల్లీలోని కర్ణిసింగ్ స్టేడియంలో ఇటీవల జరిగిన పది మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ లో పాల్గొనేందుకు అర్హత సాధించిన మహితాను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. త్వరలో ఢిల్లీలో జరగనున్న ఎయిర్ రైఫిల్ ఈవెంట్ లో పాల్గొని విశేష ప్రతిభ కనబరచాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా క్రీడాకారిణి మహిత తండ్రి దెందుకూరి వెంకటపతిరాజును చైర్మన్ చైతన్యరాజు అభినందించారు. మహితను బాల్యం నుంచి చక్కటి తర్ఫీదునిస్తూ జాతీయ క్రీడాకారిణిగా ఎదిగేందుకు ప్రోత్సహించడం హర్షణీయమని అన్నారు.       

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us