UPDATED 26th OCTOBER 2017 THURSDAY 9:00 PM
సామర్లకోట: సామాజిక సేవా కార్యక్రమాలలో జర్నలిస్టుల పాత్ర అభినందనీయమని మున్సిపల్ చైర్మన్ మన్యం పద్మావతి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణంలో ఏపీయూడబ్యుజె పెద్దాపురం నియోజకవర్గ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బూరాడ శ్రీనివాసరావు అధ్యక్షతన స్థానిక లయన్స్ క్లబ్ ఆవరణలో గురువారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాలలో జర్నలిస్టుల సేవలు అభినందనీయమన్నారు. ఏపీయూడబ్యుజె జిల్లా అధ్యక్షుడు స్వాతిప్రసాద్ మాట్లాడుతూ పెద్దాపురం నియోజకవర్గ ప్రెస్ క్లబ్ సమాజసేవను దృష్టిలో ఉంచుకొని పేదలకు ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించడం ప్రశంసనీయమని, జిల్లాలోని జర్నలిస్టులందరికి ఆదర్శంగా నిలిచేలా ఐక్యతతో ఇటువంటి సేవా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ శిబిరంలో 180 మంది పేదలకు కంటి పరీక్షలు నిర్వహించి శస్త్ర చికిత్సకు అర్హత ఉన్న 55 మందిని గుర్తించి కిరణ్ కంటి ఆసుపత్రికి తరలించారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్యుజె ప్రతినిధులు రాకుర్తి రాంబాబు, సుంకర ప్రసాద్, సాంబశివరావు, ఆర్.వి. రమణమూర్తి, సుబ్రహ్మణ్యం, కుమార్, రాజా శ్రీనివాస్, మాసా చంద్రరావు( చందు), వెంకట్, శ్రీకాంత్, ఆలీ, లోవరాజు, వినాయక్, వీరభద్ర వర్మ, పల్లంరాజు, చంద్రదాస్, సత్తిబాబు, రమేష్, మానవహక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ, కిరణ్ కంటి ఆసుపత్రి వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.







