కాపు మహిళకే మేయర్‌ పదవి

UPDATED 8th AUGUST 2017 TUESDAY 8:00 PM

కాకినాడ : కాకినాడ నగరపాలక సంస్థ మేయర్‌ పదవిని కాపు మహిళకు కేటాయిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి  నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. స్థానిక జిల్లా టిడిపి కార్యాలయంలో మంగళవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మేయర్‌ పదవిని ఓసీ జనరల్‌కు కేటాయించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని, అయితే అభ్యర్థిని పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందన్నారు. అలాగే కార్పొరేటర్లుగా పోటీచేసే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి రూపొందించిన ప్రాథమిక జాబితాను అధిష్ఠానానికి పంపిచామని, బుధవారం సాయంత్రానికి కల్లా తుది జాబితా వెల్లడవుతుందన్నారు. ప్రతి డివిజన్‌లోనూ బలమైన అభ్యర్థులను నిలిపేందుకు కృషి చేస్తున్నామని, అలాగే నగరపాలక సంస్థ ఎన్నికల్లో బిజెపితో పొత్తు ఉంటుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలోఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు నామన రాంబాబు, జడ్పీఛైర్మన్‌ జ్యోతుల నవీన్‌కుమార్‌, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పిల్లి అనంతలక్ష్మి జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి పిల్లి సత్తిబాబు, నగర టిడిపి అధ్యక్షుడు సుంకర తిరుమలకుమార్‌, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు కటకంశెట్టి బాబి తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us