మరిడమ్మ దేవస్థానంలో వైభవంగా లక్ష్మీ గణపతి హోమం, గోపూజ

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 22 డిసెంబర్ 2021: స్థానిక మరిడమ్మ దేవస్థానంలో అత్యంత వైభవంగా లక్ష్మీ గణపతి హోమం, గోపూజా కార్యక్రమాలను బుధవారం నిర్వహించారు. దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ కె. విజయలక్ష్మి, ఫౌండర్ ట్రస్టీ డాక్టర్ చింతపల్లి బ్రహ్మాజీ ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా గోమాతను ఆలయం చుట్టూ ప్రదక్షిణ గావించి, అనంతరం అమ్మవారి సన్నిధిలో గోమాతను ఆలయ అర్చకులు ప్రత్యేకంగా అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ప్రజలకు సర్వ శుభాలు కలగాలని లక్ష్మీ గణపతి హోమాన్ని నిర్వహించారు. అనంతరం ప్రసాదాలను వితరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us