జెఇఇ ఫలితాలలో కెఎస్ఎన్ విద్యార్థుల హవా

UPDATED 30th APRIL 2019 TUESDAY 9:00 PM

సామర్లకోట: జెఇఇ మెయిన్స్ పరీక్షా ఫలితాలలో కెఎస్ఎన్ విద్యా సంస్థల విద్యార్థులు జాతీయస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ర్యాంకులు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఆర్. రాధాకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ప్రిన్సిపాల్ రాధాకృష్ణ మాట్లాడుతూ తమ సంస్థలో విద్యను అభ్యసిస్తున్న కె. భాస్కర శ్రీనివాస్ జాతీయస్థాయిలో 1796వ ర్యాంక్ సాధించగా, బిఎస్ఎస్ వీరదొర 2641వ ర్యాంక్, షణ్ముక్ కౌశిక్ 2729వ ర్యాంక్, పి. వెంకట్ 3264వ ర్యాంక్, ఎన్.వి.వి. సత్యన్నారాయణ 6736వ ర్యాంక్, గంటా జయసంతోష్ 7150వ ర్యాంక్, వై. రాము 8580వ ర్యాంక్, జి. నారాయణరావు 8084వ ర్యాంక్ సాధించారని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రిన్సిపాల్ ఆర్. రాధాకృష్ణ, ఎవో జెవి నాయుడు, అధ్యాపకులు, తదితరులు అభినందించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us