ఆదిత్య ఆధ్వర్యంలో ఉన్నత భారత్ అభియాన్ సర్వే

UPDATED 8th JANAUARY 2019 TUESDAY 6:30 PM

గండేపల్లి: గండేపల్లి మండలం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ఉన్నత భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కొండపల్లి, సింగంపల్లి, పి.నాయకంపల్లి  గ్రామాలలో ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లు గ్రామంలో పర్యటించి గ్రామస్థుల ఇళ్లకు వెళ్లి వారి స్థితిగతులు, సౌకర్యాలు, సమస్యలు వంటి విషయాలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఉన్నత భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆదిత్య ఎన్ఎస్ఎస్ విభాగం దత్తత గ్రామంలో సర్వే నిర్వహిస్తోందని, ఒక్కొక్క గ్రామం సర్వే నిమిత్తం 70మంది వాలంటీర్లును పంపించి వారి ద్వారా ఆయా గ్రామాల్లో ప్రజల స్థితిగతులు, ఆర్ధిక, సామాజిక అంశాలపై నివేదిక తయారుచేస్తున్నారని తెలిపారు. నాయకంపల్లి గ్రామంలో నిర్వహించిన ఆరవ విడత జన్మభూమి కార్యక్రమం సందర్బంగా నిర్వహించిన గ్రామసభకు విచ్చేసిన మండల రెవిన్యూ అధికారిణికి విద్యార్థులు ఇప్పటివరకు సేకరించిన నివేదికను తయారుచేసి సమర్పించినట్లు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న వాలంటీర్లను ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు శివకుమార్, జ్ఞానవర్జిన్, విద్యార్థులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us