అచ్చంపేటలో జనసేన ఫ్లెక్సీ వివాదం

UPDATED 27th JANUARY 2019 SUNDAY 9:00 PM

సామర్లకోట: సామర్లకోట మండలం అచ్చంపేట గ్రామంలో జనసేన పార్టీకి చెందిన ఫ్లెక్సీలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చించేయడంతో గ్రామంలో ఆదివారం ఆ పార్టీకి చెందిన వందలాది మంది కార్యకర్తలు నిరసన తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పార్టీ పెద్దాపురం నియోజకవర్గ జనసేన నాయకులు తుమ్మల రామస్వామితో చర్చించారు. ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ జనసేన పార్టీకి వస్తున్న ఆదరణ సహించలేక కొంతమంది ఇటువంటి పనులకు పాల్పడుతున్నారని అన్నారు. ఎవరు ఎన్ని చేసినా తమ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఫ్లెక్సీని చించిన వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు వినతి పత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అత్తిలి సీతారామస్వామి, ఇంటి ఉమామహేశ్వరరావు, సరోజ్ వాసు, ఇంటి శ్రీను, దొరబాబు, వెంకటేష్, వెంకటలక్ష్మీ, దుర్గాదేవి, ముమ్మడి లక్ష్మణ్, సుంకర కృష్ణవేణి, సురేష్, బుచ్చిరాజు, కాశి, త్రిమూర్తులు, ఆది, బాల, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us