UPDATED 28th JANUARY 2018 SUNDAY 9:30 PM
సామర్లకోట : తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణంలో పలువురు ఆదివారం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ నుంచి సుమారు 100 మంది పార్టీలోకి చేరారు. వైసీపీ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జ్ కురసాల కన్నబాబు, చలమలశెట్టి సునీల్ సమక్షంలో పార్టీలోకి చేరారు. వైసీపీ పెద్దాపురం నియోజకవర్గ ఇంచార్జ్ తోట సుబ్బారావు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా విచ్చేసిన కన్నబాబు, సునీల్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచెయ్యాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఆవాల లక్ష్మీనారాయణ, పట్టణ కార్యదర్శి సేపేని సురేష్, యూత్ సభ్యుడు గంప శివ, సారంపాటి లోవచారి, కాపుగంటి కామేశ్వరరావు, జిగిని వీరభదర్రావు, గంగిరెడ్డి కృష్ణమూర్తి, నేతల హరి, తదితరులు పాల్గొన్నారు.







