ఘనంగా దీపారాధన

UPDATED 23rd SEPTEMBER 2018 SUNDAY 9:00 PM

సామర్లకోట: స్థానిక బళ్ల మార్కెట్ సెంటర్ వద్ద గల బేతాళుడి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన 13 అడుగుల వినాయకుడి విగ్రహం వద్ద ఆదివారం దీపారాధన, భజన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దవులూరి దొరబాబు, దవులూరి సుబ్బారావు హాజరై వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంగినీడి గోవిందరాజు, సంగినీడి శ్రీనివాసు, అల్లం అయ్యప్ప, గుండు వంశీ, బండారు సురేష్, చుండ్రు వీరబాబు, నిమ్మగడ్డ వీరభద్రరావు, మేకుల సత్తిబాబు, మేడా మధు, తళారి వీరబాబు, తదితరులు ఆధ్వరంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాలు స్వీకరించారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us