ఆదిత్య అసోసియేట్ ప్రొఫెసర్ గంగాధరరావుకు డాక్టరేట్

UPDATED 4th JULY 2020 FRIDAY 8:00 PM

గండేపల్లి(రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య  కాలేజ్  ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ  కళాశాల మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ పి. గంగాధర రావు జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (కాకినాడ) నుంచి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (డాక్టరేట్) పొందినట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. జెఎన్టీయూకె, ఐఐటి (భువనేశ్వర్)కు చెందిన డాక్టర్ వి. పాండురంగ గైడెన్స్ లో గంగాధరరావు సమర్పించిన "స్టడీ ఆఫ్ మెకానికల్ అండ్ ట్రిబోలోజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ అల్యూమినియం బేస్డ్ హైబ్రిడ్ మెటల్ మాట్రిక్స్ కంపోసిట్స్" థీసిస్ కు డాక్టరేట్ పొందినట్లు తెలిపారు. డాక్టర్ గంగాధరరావు తన క్రమశిక్షణ, నిరంతర కృషి, విజ్ఞానంతో మరింత మందికి మార్గదర్శకంగా నిలుస్తూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్. డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, డాక్టర్ ఆదిరెడ్డి రమేష్, డీన్ డాక్టర్ ఎ. రామకృష్ణ, విభాగాధిపతి ప్రొఫెసర్ సాగర్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, తదితరులు ఆయనను అభినందించారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us