UPDATED 31st OCTOBER 2018 WEDNESDAY 9:00 PM
పెద్దాపురం: రాష్ట్రస్థాయిలో జరగనున్న అండర్-17 ఫుట్ బాల్ పోటీలకు పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నవిద్యార్థి సుందరపల్లి పట్టాభిరామయ్య ఎంపికయినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బండి చిన్నబాబు తెలిపారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ ఈ సంవత్సరం నవంబర్లో విశాఖపట్టణంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో విద్యార్థి పాల్గొంటాడని తెలిపారు. విద్యార్థిని పాఠశాల వ్యాయమ ఉపాధ్యాయులు గుంటూరు వరసా ధనం, ఉపాధ్యాయులు అనివిళ్ల శాస్త్రి సురేష్, గణేష్, తదితరులు అభినందించారు.







