Rishi Sunak : ‘నేను హిందువునే..’ గర్వంగా చెప్పుకున్న రిషి సునక్.. బ్రిటన్ తొలి హిందూ ప్రధానిగా చరిత్ర

UPDATED 25th OCTOBER 2022 TUESDAY 07:30 AM

Rishi Sunak Hindu : భారత మూలాలున్న రిషి సునక్ చరిత్ర సృష్టించారు. బ్రిటన్‌కు తొలి భారత/ఆసియా సంతతి ప్రధాని కాబోతున్నారు. యూకే 57వ ప్రధానమంత్రిగా 42 ఏళ్ల రిషి సునక్ బాధ్యతలు తీసుకోనున్నారు. 1812లో ప్రధాని అయిన లార్డ్ లివర్ పూల్ తర్వాత ఆ స్థాయికి ఎదిగిన అత్యంత చిన్న వయస్కుడిగా మరో రికార్డు సృష్టించారు రిషి సునక్.

ఒకప్పుడు మనల్ని పాలించిన బ్రిటీష్ సామ్రాజ్యాన్ని ఇప్పుడు మనోడు పాలించబోతున్నాడు. దీపావళి పండుగ రోజున 130 కోట్ల భారతీయులకు మర్చిపోలేని గిఫ్ట్ అందించారు మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు.రవి అస్తమించని సామ్రాజ్యాన్ని పాలించడం తమకు మాత్రమే తెలుసంటూ విర్రవీగిన తెల్లదొరలకు ఇప్పుడు భారత సంతతికి చెందిన రిషి సునక్ ప్రధాని అయ్యారు. భారత సంతతి వ్యక్తి బ్రిటన్ ను పరిపాలించనుండడం చరిత్రలో నిలిచిపోయే అంశం.

బ్రిటన్‌ పాలనా పగ్గాలు అందుకున్న తొలి భారత సంతతి వ్యక్తిగా అరుదైన ఘనత సాధించారు రిషి. ఈ సందర్భంగా రిషి సునక్‌ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు.తాను హిందువునని రిషి సునక్ గర్వంగా ప్రకటించుకున్నారు. బయట కూడా ఆయన తన మత సంప్రదాయాలను, విశ్వాసాలను ఆచరిస్తూ కనిపిస్తారు. 2015లో తొలిసారి బ్రిటన్ పార్లమెంట్‌కు ఎన్నికైనప్పుడు భగవద్గీత మీద ఆయన ప్రమాణం చేశారు. ఆయన గెలుపు కోసం బ్రిటన్‌లోని భారత సంతతి ప్రజలు పూజలు సైతం చేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us