భక్తిశ్రద్ధలతో తొలి ఏకాదశి

UPDATED 23rd JULY 2018 MONDAY 9:00 PM

సామర్లకోట: ఆషాఢ మాసంలో వచ్చిన తొలి ఏకాదశిని భక్తులు సోమవారం ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక పంచారామ క్షేత్రంలో గల శ్రీ మహావిష్ణువు ఆలయం, మాండవ్య నారాయణ స్వామి, వేణుగోపాలస్వామి ఆలయాల్లో ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని స్వామిని వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. పండగలన్నీ ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయని, ఆరాధ్య దైవాన్ని పూజిస్తే పుణ్యఫలం దక్కుతుందని పురాణాలు చెబుతుండటంతో ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు వరుస కట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కుమారారామ భీమేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి పులి నారాయణమూర్తి, ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహనరావు దంపతులు, సభ్యులు మహంకాళి వెంకట గణేష్, దూది రాజు, పడాల వీరబాబు, ఇమ్మంది వెంకటేశ్వరరావు, భక్త సంఘం నాయకులు తూతిక కామేశ్వరరావు, అన్నదాన ట్రస్టు కార్యదర్శి బిక్కిన పరమేశ్వర సాయి దంపతులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us