జనం మెచ్చే పాలన అందిస్తాం

UPDATED 1st APRIL 2019 MONDAY 9:00 PM

సామర్లకోట: జనం మెచ్చే పాలన అందించే శక్తి జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌కే ఉందని ఆ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తుమ్మల రామస్వామి (బాబు) అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సామర్లకోట పట్టణ పరిధిలో గల 13,14,16 వార్డులతో పాటు మండల పరిధిలోని జి. మేడపాడు, తదితర గ్రామాల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక సంగీతరావుపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మహిళలు హారతులు ఇచ్చి ఆయనకు ఘన   స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో నిరంతరం పోరాడేతత్వం కలిగి ఉన్న పవన్‌ కల్యాణ్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకునేం దుకు వీలుగా జనసేన పార్టీని గెలిపించాలని కోరారు. జనసేన సిద్ధాంతాలను, ఆశయాలను ప్రజలు విశ్వసిస్తున్నారని, జనసేన పార్టీ  పట్ల ఆదరణ రోజురోజుకూ పెరుగుతోందని అన్నారు. ఈ ప్రచారంలో ఇంటింటికీ తిరిగి పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ తమ పార్టీ గుర్తు గాజుగ్లాసుపై ఓట్లు వేసి తనను  గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆకుల పెదబాబు, మంచాల దొర, మార్తాండ ఠాగూర్, బాబ్జి, నానాజీ, సరోజ్ వాసు, ఎస్. ఉదయకుమార్, తుమ్మల ప్రసాద్, మహ్మద్ షఫీయుల్లా, పెంకే వెంకటలక్ష్మి, కృష్ణవేణి, పిట్టా జానకి రామారావు, చింతల నాగేశ్వరరావు, చెర్రీ యూత్. అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. 

 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us