అక్టోబర్ 9న ఆదిత్యలో చర్చి ప్రారంభోత్సవం

UPDATED 8th OCTOBER 2018 MONDAY 7:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా ప్రాంగణంలో నూతనముగా నిర్మించిన చర్చిని ఈ నెల తొమ్మిదవ తేదీ మంగళవారం ఉదయం 10గంటలకు ప్రారంభించనున్నట్లు ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. విద్యార్థులలో ఆధ్యాత్మిక భావాలు పెంపొందించేందుకు ప్రాంగణంలో గల వివిధ కళాశాలలలో చదివే విద్యార్థులకు వారి వారి మతవిశ్వాసాలకు విలువనిస్తూ ఆధ్యాతిక మందిరాలు నిర్మించడం జరిగిందని, గతంలో సరస్వతి, షిరిడీ సాయి దేవాలయాలు, మసీదులను ప్రారంభించిన సంగతి విదితమే అన్నారు. నేడు క్రిస్టియన్ సోదరుల కోసం నిర్మించిన చర్చిని ప్రముఖ క్రైస్తవ మతభోదకులు బ్రదర్ అనిల్ కుమార్, ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ ఎమ్.ఎల్.సి జూపూడి ప్రభాకరరావు ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. వీరితో పాటు ఉభయగోదావరి జిల్లాలలో గల వివిధ చర్చిలకు సంబంధించిన పాస్టర్లు, ప్రభోధకులు రానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us