UPDATED 3rd NOVEMBER 2018 SATURDAY 9:00 PM
గండేపల్లి: బ్యాంకింగ్ వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలను బ్లాక్ చైన్ అకౌంటింగ్ ద్వారా సులభంగా పరిష్కరించవచ్చని ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి అన్నారు. గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్లో అసోసియేట్ ప్రొఫెసర్లుగా సేవలు అందిస్తున్న డాక్టర్ టి. దుర్గాప్రసాద్, సురేంద్రలకు తమిళనాడులోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జరిగిన కామర్స్ అండ్ మేనేజ్ మెంట్ విభాగంలో బ్లాక్ చైన్ అకౌంటింగ్ అనే అంశంపై ఇచ్చిన ప్రెసెంటేషన్ కు విశిష్ట గౌరవం దక్కిందన్నారు. తమ కళాశాల అధ్యాపకులు నూతన అంశాలను పరిశోధనాత్మకంగా అందిస్తున్నారని, తద్వారా విద్యార్థులకు భోధనా పద్దతులపై అవగాహన కల్పిస్తూ వారి భవిష్యత్తుని ఉజ్వలంగా నిర్మించడంలో వారి సేవలు విలువయినవని ఆమె అన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. ఆస్థాశర్మ, తదితరులు అధ్యాపకులను అభినందించారు.







