UPDATED 26th NOVEMBER 2018 MONDAY 9:00 PM
సామర్లకోట: కలియుగ ప్రత్యక్షదైవం వెంకటేశ్వర స్వామివారి దివ్య సన్నిదిలో తిరుపతి మహతి కళా క్షేత్రంలో ఈ నెల 24,25 తేదీలలో నిర్వహించిన మూడవ జాతీయస్థాయి నంది నృత్యోత్సవంలో పాల్గొని నర్తించిన తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణానికి చెందిన కూచిపూడి నృత్యకారుడు అలమండ ప్రసాద్ ను నిర్వాహకులు గరుడ నాట్య నంది ఆవార్డుతో ఘనంగా సత్కరించారు. శ్రీ సాయి నాట్యాంజలి పైన్ ఆర్ట్స్ అండ్ డవలప్ మెంట్ అసోసియేషన్, నంది ఆర్ట్స్ అండ్ ఆర్టిస్ట్స్ డవలప్ మెంట్ అసోసియేషన్, ఫోక్ అండ్ ట్రైబల్ సొసైటీల సంయుక్త ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో రెండు రోజులపాటు నిర్వహించిన ఈ జాతీయ నృత్యోత్సవంలో ప్రసాద్ పాల్గొని కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉత్సవం ముగింపు సభలో ప్రసాద్ కు ముఖ్య అతిధులు కూచిపూడి కళాక్షేత్రం ప్రిన్సిపాల్ వేదాంతం రామలింగశాస్త్రి, రాష్ట్రపతి ఆవార్డు గ్రహీత వేదాంతం రాధేశ్యామ్, ఎమ్మెల్యే సుగుణమ్మ, నిర్వాహకులు మునుకుంట్ల సాంబశివ, పల్లెంశెట్టి సురేష్ గరుడ నాట్య నందిని పురస్కారం, నంది బహుమతిని అందచేసి పూలమాలలు, దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నృత్యకారుడు ప్రసాద్ మాట్లాడుతూ జాతీయస్థాయి నృత్యోత్సవాలకు తొమ్మిది రాష్ట్రాల నుంచి 18 మంది నృత్య గురువులు, 180 మంది నృత్యకారులు హాజరయ్యని తెలిపారు. తనను పురస్కారంతో సత్కరించిన నిర్వాహకులకు ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా గరుడ నాట్య నంది పురస్కారం పొందిన నృత్యకారుడు ప్రసాద్ ను అభినందించిన వారిలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హెూంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, సామర్లకోట మున్సిపల్ చైర్ పర్సన్ మన్యం పద్మావతి చంద్రరావు, వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్ (చిన్ని), శ్రీ కంచి కామకోటి మహాసంస్థానం చైర్మన్ చంధ్రాభట్ల చింతామణి గణపతిశాస్త్రి, ప్రముఖ సీనియర్ కళాకారులు అంబటి అప్పారావు, పారిశ్రామికవేత్తలు సింగవరపు సాయిబాబు, తులసీధరరావు సోదరులు, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ చిత్తులూరి వీర్రాజు (రాజా), రోటరీ క్లబ్ నాయకుడు అంబటి సుబ్రహ్మణ్యం, శ్రీ వీరభద్రా జ్యోతిషాలయం నిర్వాహకులు చీమలకొండ వీరభద్ర ప్రసాద్ (ఆస్ట్రో ప్రసాద్) తదితరులున్నారు.







