గంగవరంలో కొవ్వొత్తుల ప్రదర్శన

గంగవరం (రెడ్ బీ న్యూస్) 8 నవంబర్ 2021:
గంజాయి అక్రమరవాణా నియంత్రణలో భాగంగా జిల్లా పోలీసుశాఖ సోమవారం గంగవరం ఎస్ఐ షరీఫ్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది పరివర్తన ర్యాలీ నిర్వహించారు. వై జంక్షన్ లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ గంజాయి అక్రమరవాణాలో గిరిజన యువత బలి అవుతోందన్నారు. గంజాయి అక్రమరవాణాకు ఎవరు సహకరించవద్దని, అలాగే నాటు సారా తయారీ విక్రయాలను ప్రోత్సహించవద్దని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐలు రజాక్, రమణ, లత, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us