Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో రెండో చార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ.. 17 మందిపై అభియోగాలు నమోదు

Updated 2nd February 2023 Thursday 5:10 pm

Delhi Liquor Scam: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణ కీలక దశకు చేరుకుంది. ఈ కేసుపై విచారణ జరుపుతున్న ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) రెండో చార్జిషీటు దాఖలు చేసింది. ఈ చార్జిషీటులో పలువురు కీలక వ్యక్తులు సహా మొత్తం 17 మందిపై ఈడీ అభియోగాలు నమోదు చేసింది.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్లను కూడా ఈడీ ప్రస్తావించింది. అయితే, వీరి పేర్లను నిందితులుగా కాకుండా, కేవలం ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తాజాగా ఈడీ దాఖలు చేసింది సప్లిమెంటరీ చార్జిషీటులో మొత్తం 428 పేజీలున్నాయి. ఈ చార్జిషీటును ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అనంతరం నిందితులకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. నిందితుల్ని ఏ1, ఏ2 నుంచి ఏ17 వరకు పరిగణిస్తూ నోటీసులు ఇచ్చింది. వీళ్లంతా తదుపరి విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనిపై తదుపరి విచారణ ఫిబ్రవరి 23న జరుగుతుంది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us