ఆదిత్యలో ఘనంగా ఓనం ఉత్సవాలు

UPDATED 22nd SEPTEMBER 2019 SUNDAY 8:00 PM 

గండేపల్లి(రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, ఫోరెన్సిక్ కళాశాలల్లో చదువుచున్న కేరళ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు తమ సాంస్కృతి, సాంప్రదాయం ఉట్టిపడేలా "ఓనమ్" పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ఫోరెన్సిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఇ.మోహన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన కార్యక్రమంలో ఆదిత్య విద్యా సంస్థల అధినేత డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులంతా ఉత్సాహంగా ఓనమ్ ఉత్సవాలు జరుపుకోవాలని అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. తారంగం- 2కె19 పేరిట జరిపిన ఓనం ఉత్సవాలు మిన్నంటిన సంబరాలతో ఆదిత్య క్యాంపస్ మరో కేరళను తలపించేలా సందడిగా మారింది. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా విచిత్ర వేషధారణలు, సంగీత వాయిద్యాల నడుమ నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలకు బహుమతులను అందచేశారు. కేరళ సాంప్రదాయం ప్రకారం రకరకాల పిండివంటలతో భోజనాలు ఏర్పాటు చేశారు.  ఈకార్యక్రమంలో కేరళ రాష్ట్రానికి చెందిన షాహిద్ రాజ్, హాస్టల్ వార్డెన్లు, అధికసంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us