విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి

UPDATED 6th JUNE 2018 WEDNESDAY 7:00 PM

పెద్దాపురం: రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మండలంలోని వడ్లమూరు గ్రామంలో విజ్ఞాన రాష్ట్రం ఉపాధి కల్పనపై ఐదవ రోజు నవ నిర్మాణ దీక్ష కార్యక్రమంలో భాగంగా గ్రామంలో నిర్వహించిన ర్యాలీలో హోంమంత్రి బుధవారం పాల్గొన్నారు. అనంతరం మంత్రి చినరాజప్ప విజ్ఞాన రాష్ట్రం, ఉపాధి కల్పన అంశాలపై మాట్లాడుతూ విద్యాపరంగా రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచడానికి ప్రభుత్వం నిధులను మంజూరు చేసి విద్యావ్యాప్తికి కృషి చేస్తుందని, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఉచిత విద్యతో పాటు పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, దుస్తులు   అందచేస్తుందని, పేద కుటుంబంలోని విద్యార్థులకు స్కాలర్ షిప్స్, ఫీజు రియంబర్స్ మెంట్ సౌకర్యాలు, ఎల్.కె.జి నుంచి పిజి వరకు ఉచితంగా విద్యను ప్రభుత్వం అందిస్తుందన్నారు. ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఉన్నత  విద్యావకాశాలు కల్పిస్తున్నామని, రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని చెప్పారు. వడ్లమూరు గ్రామంలో 320 మందికి ఇళ్ళపట్టాలు అందచేశామని, బాలయోగి, ఎన్టీఆర్ కాలనీలుగా ఏర్పాటు చేసి ఇళ్ళ నిర్మాణం చేపడతామని, ఈ గ్రామంలో కళ్యాణ మండపాలు నిర్మిస్తామని అన్నారు. ప్రతి గ్రామంలో సి.సి రోడ్లు, డ్రైనేజీలు, త్రాగు, సాగునీరు, పంచాయతీ, అంగన్వాడీ కేంద్రాలు, కమ్యూనిటీ భవనాలు, శ్మశానవాటికలు, తదితర మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలన్నారు.  అనంతరం గ్రామంలో ముస్లింలకు రంజాన్ తోఫా కిట్లు, ఇళ్ళ పట్టాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాలచర్ల రమాదేవి, పాలచర్ల ఉమామహేశ్వరరావు (బుజ్జి), అన్నవరం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు కందుల విశ్వేశ్వరరావు, జెడ్పీటిసి సుందరపల్లి శివనాగరాజు, గుడా డైరెక్టర్ ఎలిశెట్టి నాని, మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడు కొత్తెం వెంకట శ్రీనివాసరావు (కోటి), కమ్మిల సుబ్బారావు, ఆత్మా చైర్మన్ కలకపల్లి రాంబాబు, ప్రత్యేక అధికారి మల్లిఖార్జునరావు, తహసీల్దార్ గోగుల వరహాలయ్య, ఎంపిడివో పల్లాబత్తుల వసంత మాధవి, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us