కమ్యూనికేషన్ స్కిల్స్ పై అవగాహనా సదస్సు

UPDATED 13th AUGUST 2018 MONDAY 9:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ పై సోమవారం అవగాహనా సదస్సు నిర్వహించినట్లు కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి తెలిపారు. ఈ సదస్సుకు ముఖ్య అతిధిగా ఓఎన్జిసి సంస్థలో సేవలందిస్తున్న సుహాసిని గుంటూరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ సుగుణారెడ్డి మాట్లాడుతూ బిజినెస్ మేనేజ్ మెంట్ విద్యార్థులకు వివిధ రంగాలలో అనుభవజ్ఞుల సలహాలు సూచనలు ఎంతో ఉపయోగపడతాయని, నేడు వ్యాపారరంగంలో రాణించాలంటే ఆయా రంగాలలో నిష్ణాతులైన వారి అనుభవాలు తరగతిలో భోదించే పాఠ్యాంశాల కన్నా ఎంతో విలువైనవని అన్నారు. ముఖ్య అతిధి సుహాసిని మాట్లాడుతూ వ్యాపారరంగంలో రాణించాలంటే ముందు ప్రతి ఒక్కరూ తమపై తమకు నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే సరైన నిర్ణయాలు తీసుకొని  ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. మనం అభివృద్ధి చెందడంతో పాటు దేశాభివృద్ధిలో భాగస్వాములు అయ్యే విధంగా విద్యార్ధులు ఎదగాలని అభిలషించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ డి. ఆస్థాశర్మ మాట్లాడుతూ సుహాసిని ఎం.ఎస్, ఎంబిఏ చదివి, సుమారు 14 దేశాలలో సేవలు అందించారని, వారి అనుభవాలను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు ప్రణాళికా బద్దంగా ఎన్నుకొన్న మార్గంలో అభివృద్ధి సాధించాలని సూచించారు. విద్యార్థి సమున్నత అభివృద్ధి కోసమే ఎంతో శ్రమకోర్చి ఇటువంటి ప్రముఖలతో సదస్సులు నిర్వహించడం జరుగుతుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us