సమాజంలో స్వచ్చంధ సేవా సంస్థల పాత్ర కీలకం

UPDATED 3rd JANUARY 2018 WEDNESDAY 11:55 AM 

సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామం శ్రీ శారదా రామకృష్ణ సేవాసమితి 2018వ సంవత్సరం కేలండర్ ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల క్యాషియర్, శ్రీ శారదా రామకృష్ణ సేవాసమితి అధ్యక్షుడు తోటకూర గంగాధర్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ సమాజంలో స్వచ్చంధ సేవా సంస్థల పాత్ర ఎంతో కీలకమని, 1960 నుంచి సమాజానికి సేవలందిస్తున్న శ్రీ రామకృష్ణ సేవాసమితి సభ్యులను ప్రతీ ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సమితి గౌరవ సభ్యులు ప్రముఖ గణితావధాని, రాష్ట్రపతి అవార్డు గ్రహీత తోటకూర సాయి రామకృష్ణ, కార్యదర్శి వింజమూరి విశ్వనాధం, సభ్యులు టి.వి.వి. సత్యనారాయణ, పెంటకోట గంగాధరరావు, ఎన్.బాబ్జి, తదితరులు పాల్గొన్నారు.     

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us