పోలవరం ప్రాజెక్ట్ పనులు పరిశీలన

UPDATED 8th JULY 2020 WEDNESDAY 7:30 PM

రాజమహేంద్రవరం(రెడ్ బీ న్యూస్): పోలవరంలోని ప్రాజెక్టుకు సంబందించిన పనులు వేగవంతంగా జరుగుతున్నట్లు రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన స్పిల్‌వే , కాపర్ డ్యాం పనుల ప్రగతిని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనాథ్ మాట్లాడుతూ ప్రాజెక్టు పనులు వేగంగా జరగడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రాజెక్ట్ ప్రగతి ప్రజలకు తెలిసేలా అక్టోబర్ నెలలో స్టేట్ మీడియా, అలాగే డిసెంబరు నెలలో నేషనల్ మీడియాను పిలిచి విస్తృత ప్రచారం నిర్వహించేందుకు బృహత్తర కార్యక్రమం చేపడతామని అన్నారు. ముందుగా మెగా ఇంజనీరింగ్ కంపెనీ అతిథి గృహంలో సిఈ ఎం. సుధాకర బాబు, ఎస్ఈ, ఎం. నాగిరెడ్డి, ఇరిగేషన్ అధికారులతో ప్రాజెక్ట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ కలెక్టర్ ఇ. మురళి, స్పెషల్ ఆఫీసర్ ఆనంద్ బాబు, ఇరిగేషన్ ఎస్ఈ ఎం. నాగిరెడ్డి, మెగా ఇంజనీరింగ్ కంపెనీ జనరల్ మేనేజర్, ఏ. సతీష్ బాబు, ప్రాజెక్ట్ మేనేజర్ టి. మురళి, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us