UPDATED 19th JUNE 2019 WEDNESDAY 7:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్లో బిబిఎ ప్రథమ సంవత్సరం తరగతులు ఆదికవి నన్నయ యూనివర్సిటీ (రాజమహేంద్రవరం) ఆదేశాల మేరకు బుధవారం నుంచి ప్రారంభించినట్లు కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు డిగ్రీ పునాది అని, విద్యార్థులు వారు ఎంచుకున్న లక్ష్యాలను చేరుకునే వరకు విశ్రమించరాదని అన్నారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు కష్టపడి చదివి కాలానుగుణంగా మారుతున్న నూతన పద్ధతులు, ఆధునిక టెక్నాలజీ వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. ఆస్ధాశర్మ మాట్లాడుతూ మనిషి జీవితంలో విద్యార్థి దశ ఎంతో ముఖ్యమైనదని, ఆ దశలో విద్యార్థులు తమ విలువైన సమయాన్ని విద్య కోసం కేటాయించినపుడే విజేతలు కాగలరని అన్నారు. అనంతరం టీమ్ బిల్డింగ్, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, వృత్తిపరమైన ప్రేరణ, భావజాలం, తదితర అంశాలపై అధ్యాపకులు శిక్షణ ఇచ్చారు.







