UPDATED 14th NOVEMBER 2018 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: పట్టణానికి చెందిన మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారిణి బొడ్డు సుప్రియ సన్మాన కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమేశ్వర లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ఇస్మాయిల్ నగర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ యాంకర్ హరితేజ పాల్గొన్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న సుప్రియ కోచ్ డి.శంకర్ (కాకినాడ) శిక్షణలో ఇంతవరకు 27 జాతీయ, రాష్ట్రస్థాయి పతకాలను సాధించగా, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి, స్త్రీ, శిశుసంక్షేమ శాఖా మంత్రి పరిటాల సునీత చేతుల మీదుగా ప్రతిభా అవార్డు, దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా క్రీడా ప్రతిభా అవార్డులు సాధించింది. ఈ సందర్భంగా సుప్రియను లయన్స్ క్లబ్ రీజినల్ చైర్మన్ ఈదల ఈశ్వరకుమార్, జోన్ చైర్మన్ చిత్తులూరి వీర్రాజు (రాజా) కెఎస్ఎన్ కళాశాల ప్రిన్సిపాల్ రాధాకృష్ణ, ఏవో నాయుడు, కోచ్ డి.శంకర్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు సేపేని సురేష్, జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శిరీష, పిఇటి శ్రీదేవి, తదితరులు అభినందించారు







