నవంబర్ 21 నుంచి ఆదిత్యలో ఫుట్ బాల్ లీగ్-2 పోటీలు

UPDATED 20th NOVEMBER 2018 TUESDAY 5:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో గల ఆదిత్య ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల గ్రౌండ్స్ లో తూర్పుగోదావరి జిల్లా ఫుట్ బాల్ అసోసియేషన్ సౌజన్యంతో ఫుట్ బాల్ లీగ్-2 పోటీలు ఈనెల 21 నుంచి 25వ తేదీ వరకు మొదటి రౌండ్, డిసెంబర్ 1 నుంచి రెండవ రౌండ్ పోటీలు నిర్వహించనున్నట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ పోటీలు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధులుగా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ విశాల్ గున్ని, పెద్దాపురం డిఎస్పీ చిలకా వెంకట రామారావు హాజరుకానున్నారని తెలిపారు. ఈ పోటీలు నవంబర్ 21వ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమవుతాయని, జిల్లా వ్యాప్తంగా 12 టీములు పాల్గొంటున్న ఈ పోటీలు లీగ్ పద్దతిలో జరుగుతాయని అన్నారు. మొదటి నాలుగు స్థానాలలో నిలిచిన జట్లకు ప్రథమ బహుమతిగా రూ.40వేలు నగదు, ట్రోఫీ, ద్వితీయ బహుమతిగా రూ.30వేలు నగదు ట్రోఫీ, తృతీయ బహుమతిగా రూ.20 వేలు నగదు, ట్రోఫీ, నాల్గవ స్థానంలో నిలిచిన జట్టుకు రూ.10వేలు నగదుతో పాటు ట్రోఫీతో సత్కరించనున్నట్లు సతీష్ రెడ్డి తెలిపారు. ఈ పోటీలలో పాల్గొన్న ప్రతీ క్రీడాకారునికి ధృవీకరణ పత్రాలను అందిస్తామని అన్నారు. ఈ సమావేశంలో ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ఆదిత్య ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శరభోజి, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us